ఓరుగల్లులోని శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయంలో శాకాంబరీ నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అమ్మవారి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా ఇంద్రకరణ్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చరిత్ర, విశిష్టతను ప్రధాన అర్చకుడు మంత్రికి వివరించారు.
ఇవీ చూడండి: అడవులంటే ప్రజలకు ఇష్టం: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి