ప్రపంచ స్థాయి హంగులతో కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులు జరుగుతున్నాయని... అతిత్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని పర్యటక శాఖ మంత్రి శ్రీనివాస గౌడ్ అన్నారు. వరంగల్ ఆర్బన్ జిల్లా హన్మకొండలో రూ. 50 కోట్లతో నిర్మిస్తున్న కాళోజీ కళాక్షేత్ర నిర్మాణ పనులను ప్రభుత్వ చీఫ్ విప్,ఎమ్మెల్యే వినయభాస్కర్, జిల్లా కలెక్టర్‌తో కలిసి మంత్రి పరిశీలించారు.
హైద్రాబాద్‌లోని రవీంద్రభారతి కంటే కాళోజీ కళాక్షేత్రం అద్భుతంగా ఉండబోతోందని మంత్రి అన్నారు. పనులు ఎంతవరకు వచ్చాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు తొందరగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో లక్ష కల్లాల నిర్మాణం.. రూ.750 కోట్లు విడుదల