సంక్షేమం, అభివృద్ధి తెరాసతోనే సాధ్యమన్నది ప్రజలు గుర్తించి... ప్రతి ఎన్నికల్లోనూ నిరూపిస్తున్నారని మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదో? విపక్ష నాయకులను నిలదీయాలని కోరారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పరకాల నియోజకవర్గం పరిధిలోని 15వ డివిజన్లో మంత్రి విస్తృతంగా పర్యటించి... ఓట్లను అభ్యర్థించారు.
డప్పు కొడుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎండాకాలంలోనూ చెరువులు మత్తడి పోస్తున్నాయని... ఇది సీఎం కేసీఆర్ ఘనతేనని అన్నారు. తెరాస అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి: దివ్య రాజునాయక్