KTR Warangal District Tour Today: ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబాద్ జిల్లా తొర్రూరులో 20 వేల మంది మహిళలతో బహిరంగ సభలో పాల్గొనున్నారు. సభకు సంబంధించి గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నేతృత్వంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.
KTR Warangal Tour Today: సభావేదిక నుంచి కేటీఆర్ ఆడబిడ్డలకు సర్కారు కానుకను అందించనున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ లేని రుణాల కోసం.. రాష్ట్ర ప్రభుత్వం రూ.750 కోట్లను ప్రకటించింది. రూ.2.13 కోట్లతో ఏర్పాటు చేసిన యతి రాజారావు పిల్లల పార్కును ప్రారంభించనున్నారు. అనంతరం రూ.3.75 కోట్లతో ఏర్పాటు చేయనున్న డివైడర్లకు , రూ.5 కోట్లతో నిర్మించిన ఇండోర్ స్టేడియంకు శంకుస్థాపన చేయనున్నారు.
KTR Public Meeting in Mahabubabad Today : ఈ క్రమంలో పాలకుర్తి నియోజకవర్గంలోని కొన్ని మహిళా సంఘాలకు.. వీటికి సంబంధించిన చెక్కులను అందజేస్తారు. మధ్యాహ్నం 12:00 గంటలకు బేగంపేట విమానాశ్రయంలో బయలుదేరి, 12:25కు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లుకు మంత్రి చేరుకుంటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. ఏనుగల్లులో నిర్వహించబోయే సభలో పాల్గొంటారు.
అభయ హస్తం పథకం కింద మహిళలకు 500కు బదులుగా 2000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వారు కట్టిన అభయాసం డబ్బులు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగిన అభయహస్తం పథకానికి చెందిన రూ.545 కోట్ల నిధులకు సంబంధించిన తీపికబురు చెప్పే అవకాశముంది. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 1000 మంది మహిళలకు కుట్టు యంత్రాలు పంపిణీ చేయనున్నారు. అంతకుముందు ఆయన వరంగల్ జిల్లా పర్యతగిరి మండలం ఏనుగల్లులో ప్రతిమ మెడికల్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తారు.
మధ్యాహ్నం 2:30 గంటలకు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులను ప్రారంంభించిన అనంతరం బహిరంగ సభకు హాజరవుతారు. మంత్రి కేటీఆర్కు ఘన స్వాగతం పలికేందుకు గులాబీ శ్రేణులు సన్నద్దమయ్యారు. ఈ మేరకు ఏనుగల్లు, తొర్రూరులలో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటన ఏర్పాట్లను పలుమార్లు పర్యవేక్షించారు.
ఇవీ చదవండి: