ETV Bharat / state

ఫ్యూచర్​ సిటీగా వరంగల్​ను మారుస్తాం​: మంత్రి కేటీఆర్​ - minister ktr speech in khilla warangal fort

వ‌రంగ‌ల్ న‌గ‌రాన్ని అద్భుత‌మైన న‌గ‌రంగా తీర్చిదిద్దే బాధ్య‌త త‌నది అని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇవాళ వరంగల్​లో సుడిగాలి పర్యటన చేపట్టిన మంత్రి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. నగరానికి మెట్రో రైలు సర్వీసును అందుబాటులోకి తెచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.

minister ktr in warangal
వరంగల్​లో మంత్రి కేటీఆర్​
author img

By

Published : Apr 12, 2021, 2:47 PM IST

వరంగల్​ నగరాన్ని ఫ్యూచర్​ సిటీగా మారుస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ హామీ ఇచ్చారు. మెట్రో రైలు సర్వీసులను అందుబాటులోకి తెచ్చే బాధ్యత తమదని స్పష్టం చేశారు. వరంగల్​ అర్బన్​ జిల్లా కేంద్రంలో పర్యటించిన కేటీఆర్​ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఖిల్లా వరంగల్​ కోటలో బహిరంగ సభలో కేటీఆర్​ పాల్గొన్నారు.

పేద ప్రజలకు అండగా..

'నగరంలో కాంగ్రెస్​ హయాంలో ఉన్న విద్యుత్​ కష్టాలకు తెరాస ప్రభుత్వం స్వస్తి చెప్పింది. గ్రామాల్లో ఇంటింటికీ తాగునీటితో పాటు, పట్టణాల్లో ప్రతి ఇంటికీ అమృత్​ జల్​ అందిస్తున్నాం. పేద విద్యార్థుల విదేశీ చదువులకు రూ. 20 లక్షలు ఇస్తున్నాం. కరోనా సంక్షోభంలోనూ పేద ప్రజల ఇంటి నిర్మాణానికి, పేదింటి ఆడపిల్లల పెళ్లికి సీఎం కేసీఆర్​ ఆసరాగా నిలబడ్డారు.'

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, కేటీఆర్​

ఖాతాలో డబ్బులేవి..

2014 ఎన్నికల సమయంలో భారతీయుల జన్​ధన్​ ఖాతాల్లో రూ. 15 లక్షలు వేస్తామని చెప్పిన మోదీ.. ప్రజలకు మొండి చేయి చూపించారని విమర్శించారు. డీజిల్​ ధరలపై గత ప్రభుత్వాలను విమర్శించిన ప్రధాని మోదీ.. ఇప్పుడు పెరుగుతున్న ధరలపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రాష్ట్రానికి లక్ష కోట్ల రూపాయలు కేటాయించామన్న కేంద్ర సర్కారు.. తాము పన్నుల రూపంలో కట్టిన దాంట్లో సగమే వచ్చిందని ఎద్దేవా చేశారు.

ఫ్యూచర్​ సిటీగా వరంగల్​ను మారుస్తాం​: మంత్రి కేటీఆర్​

ఇదీ చదవండి: ఏడేళ్లలో తెరాస చేసిన అభివృద్ధి శూన్యం: బండి సంజయ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.