ETV Bharat / state

యుద్ధప్రాతిపదికన పూర్తి చేయండి: కేటీఆర్ - పురపాలక అధికారులతో మంత్రి కేటీఆర్ భేటీ

కలెక్టర్లు, మేయర్లు, మున్సిపల్ కమిషనర్లతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టణ ప్రగతిలో నిర్దేశించిన పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి అక్టోబర్ 2లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

యుద్ధప్రాతిపదికన పూర్తి చేయండి: కేటీఆర్
యుద్ధప్రాతిపదికన పూర్తి చేయండి: కేటీఆర్
author img

By

Published : Sep 15, 2020, 4:59 AM IST

పట్టణ ప్రగతిలో నిర్దేశించిన పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి అక్టోబర్ 2లోగా పూర్తి చేయాలని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. ఆదేశించారు. పురపాలక ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్​తో కలసి మంత్రి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం, స్వచ్ఛ సర్వేక్షన్ 2021, వన్ టైం సెటిల్మెంట్ మొదలగు అంశాలపై అదనపు ఉమ్మడి వరంగల్ కలెక్టర్లు, మేయర్లు, మున్సిపల్ కమిషనర్​లతో సమీక్షించారు. నిర్దేశించిన లక్ష్యాలను అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి పూర్తి చేసేలా పకడ్బందిగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరంలో నాలాలపై ఆక్రమణల తొలగింపు పురోగతిని అడిగి తెలుసుకున్నారు.

వరంగల్​లో నాలాలపై ఆక్రమణలు 324 ఉండగా 68 తొలగించామని వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్ రావు వివరించారు. కలెక్టర్ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఇరిగేషన్, రెవిన్యూ, శాఖల సమన్వయంతో దసరాలోగా 100 శాతం తొలగించుటకు చర్యలు తీసుకొంటున్నట్లు మేయర్ తెలిపారు. వన్ టైం సెటిల్మెంట్ ద్వారా పన్ను బకాయిలను 90 శాతం వడ్డీ మాఫీతో చెల్లించే గడువును ప్రజల సౌలభ్యం కోసం మరో 45 రోజులు అనగా 31 అక్టోబర్ వరకు పొడిగిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

ఇదీ చూడండి: డీగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ ఆన్​లైన్​ పరీక్షలు వీలుకాదన్న ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.