వరంగల్‌లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో గందరగోళం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రసంగిస్తుండగా... ఓ స్థానికుడు నిలదీశాడు. కాలనీలో సమస్యలు పేరుకపోయాయని... ఏమి అభివృద్ధి చేశారని స్థానికుడు ప్రశ్నించాడు.
ఆ వ్యక్తికి మంత్రి సర్ధిచెప్పేందుకు ప్రయత్నించగా... వినకపోయేసరికి ఆవేశానికి లోనయ్యారు. కాలనీ అభివృద్ధి కోసం తానేం చేశాడో చెప్పాలని స్థానికున్ని మంత్రి ప్రశ్నించారు. సమావేశంలో కావాలని గొడవ చేయొద్దని హెచ్చరించారు. అభివృద్ధి ఎంత మాత్రమూ కృషి చేయని వ్యక్తులే... సభలను చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
కూర్చొమ్మని చెప్పినా వినకపోయేసరికి.... ఆ వ్యక్తిని సమావేశం నుంచి తీసుకుపోవాలని పోలీసులకు మంత్రి సూచించారు. వెంటనే అక్కడి నుంచి స్థానికున్ని పోలీసులు తీసుకుపోయారు. ఈ గొడవతో కార్యక్రమంలో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.