కేంద్రం పురస్కారాలిస్తుంది కానీ... నిధుల్లో కోత పెడుతోందని... పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. ప్రతిభ చాటినందుకు, పనులు బాగా చేసినందుకు పూర్తి నిధులివ్వాలని... అదనంగా ఇస్తే ఇంకా సంతోషమని తెలిపారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా... రాష్ట్రీయ పంచాయతీ పురస్కారాలను వర్చువల్‌గా ప్రధాని చేతుల మీదుగా మంత్రి అందుకున్నారు.
గ్రామాలు దేశ వికాసానికి పట్టుగొమ్మలని ప్రధాని ఈ సందర్భంగా కొనియాడారు. గ్రామాలకు కరోనా పాకకుండా కట్టడి చేయాలని... కరోనా విముక్తి గ్రామాలుగా మారాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. గంగదేవిపల్లి మించి రాష్ట్రంలో అనేక గ్రామ పంచాయితీలు అభివృద్ధిలో ముందుంటున్నాయని ఎర్రబెల్లి దయకరరావు తెలిపారు. ఈ దఫా 13 అవార్డులు వచ్చాయని... ఇందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు.
ఇదీ చూడండి : రాష్ట్ర మంత్రులు అనవసర ఆరోపణలు చేస్తున్నారు: కిషన్ రెడ్డి