పత్తి, ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద అన్నదాతలు పడిగాపులు పడే పరిస్థి రాకుండా చూసుకోవాలని అధికారులను సూచించారు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో పంటల కొనుగోళ్లపై వరంగల్ అంబేడ్కర్ భవన్లో జరిగిన అవగాహన సదస్సుకు ఆయన హాజరయ్యారు. గతంతో పోలిస్తే ఈసారి అధిక దిగుబడి వచ్చే అవకాశమున్నందున కొనుగోళ్లకు సంబంధించి ఎలాంటి ఇబ్బందుకు తలెత్తకూడదన్నారు. దిగుబడికి అనుగుణంగా జిల్లావ్యాప్తంగా కేంద్రాలను పెంచాలని... సీసీఐ అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ఇదీ చదవండిః ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా వికారాబాద్‌లో ధూంధాం