వరంగల్ అర్బన్ జిల్లాలో కరోనా వ్యాప్తి కాకుండా అడ్డుకోవడం... లాక్‌డౌన్ పటిష్టంగా అమలు చేసిన పోలీసులను మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఘనంగా సన్మానించారు. వారి సేవలను కొనియాడారు. సీఎం కేసీఆర్ ఆదేశాలను జిల్లా ప్రజలు తప్పక పాటించారని... మరో ఇద్దరు డిశ్చార్జ్ అయితే కరోనా కేసులు లేని జిల్లాగా మారుతుందని మంత్రి ఎర్రబెల్లి అభిప్రాయపడ్డారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా.. ప్రజలు ప్రాణాల రక్షణకే ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నగర పోలీస్ కమిషనర్ వీ రవీందర్, మేయర్ గుండా ప్రకాశ్‌రావు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: హైదరాబాద్‌లో ఒక్క రోజులోనే 20 కేసులు