వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ మాజీ ఛైర్మన్ కొంపెల్లి ధర్మరాజు మృతిపట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విచారం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి అనేక ఒడుదొడుకులను ఎదుర్కొని ఉన్నత శిఖరాలను అధిరోహించిన నాయకుల్లో ధర్మరాజు ఒకరని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ధర్మరాజు హఠాన్మరణం తనను తీవ్రంగా కలచి వేసిందని ఎర్రబెల్లి అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఇదీ చదవండి: నాగర్జునసాగర్ ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు...