ETV Bharat / state

రోడ్డు మీద ఐస్​క్రీం కొనుక్కుని.. చిన్నపిల్లాడిలా మురిసిపోయిన మంత్రి

Minister Errabelli Dayaker Rao: ఎంత గొప్ప హోదాలో ఉన్న వ్యక్తులైనా సరే.. కొన్ని విషయాల్లో అన్ని పక్కన పెట్టేసి చిన్నపిల్లల్లా మారిపోతుంటారు. వాటితో వాళ్లకున్న అనుబంధమో.. ఇష్టమో.. జ్ఞాపకమో.. ఇలా.. కారణమేదైనా.. ఆ సమయంలో అన్ని మర్చిపోయి ఆ క్షణాన్ని ఆస్వాదిస్తూ మురిసిపోతుంటారు. అచ్చం అలాంటి ఘటనే వరంగల్​ జిల్లాలో జరిగింది. అలా చిన్నపిల్లాడిలా మారిపోయి మురిసిపోయింది.. మన మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావేనండోయ్​..!

Minister Errabelli Dayaker Rao buy ice cream and ate on road at rayaparthi

author img

By

Published : Jun 28, 2022, 4:12 PM IST

Minister Errabelli Dayaker Rao: రాజకీయంలోకి దిగాక సభలు, సమావేశాలు, పార్టీ కార్యక్రమాలంటూ నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ నేతలు బిజీబిజీగా గడుపుతారు. అందులోనూ ప్రజాప్రతినిధిగా.. అదీ ఓ మంత్రి హోదాలో ఉంటే ఇక అంతే సంగతులు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి పనుల పర్యవేక్షణ, అధికారులతో సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాలు.. ఇలా సవాలక్ష పనులతో.. బిజీలైఫ్ గడుపుతుంటారు. దైనందిన కార్యక్రమాల్లో పడి.. నేతలు తమ వ్యక్తిగత జీవితానికి, అభిరుచులకు కాస్త దూరం అవుతారు. అలాంటి బిజీ షెడ్యూల్​లోనూ.. అప్పుడప్పుడు అన్ని మర్చిపోయి సాధారణ వ్యక్తుల్లా తమ అభిరుచులను ఆస్వాదిస్తూ.. ఆనందిస్తుంటారు. అచ్చం అలాంటి క్షణాలనే.. రాష్ట్ర పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ఆస్వాదించారు. తనకెంతో ఇష్టమైన ఐస్​క్రీం తింటూ చిన్నపిల్లాడిలా మురిసిపోయారు.

వరంగల్ జిల్లా రాయపర్తి మండపంలో పర్యటిస్తున్న క్రమంలో ఊకల్ గ్రామంలో నిర్వహించే కాటమయ్య పండగకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు వెళ్తున్నారు. ఈ వెళ్లే క్రమంలో ఒక దగ్గర.. ఓ ఐస్​క్రీమ్ బండి మంత్రి కంటపడింది. వేగంగా వెళ్తున్న కాన్వాయ్​ కంటే వంద రెట్ల వేగంతో మంత్రి తన బాల్యానికి వెళ్లిపోయారు. ఐస్​క్రీం బండి కనిపించగానే.. పిల్లలంతా పరుగెత్తుకుంటూ వెళ్లి తలా ఒకటి కొనుక్కొని తింటూ కేరింతలు కొట్టే.. తన చిన్ననాటి జ్ఞాపకాలు మదిలో మెదిలాయి. ఇంకేముంది ఆ రోజులుకు గుర్తురాగానే మంత్రికి నోట్లో నీళ్లూరాయి. వెంటనే కాన్వాయ్​ని ఐస్​క్రీమ్ బండి దగ్గరు వెళ్లాలని ఆదేశించారు.

వాహనం దిగి నేరుగా ఐస్​క్రీం బండి దగ్గరికి నడుచుకుంటూ వెళ్లిన మంత్రి.. తన హోదాను పక్కన పెట్టేసి ఆ వ్యక్తితో ఆప్యాయంగా మాట్లాడారు. ఏఏ రకాల ఐస్​క్రీంలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. తనకు ఇష్టమైన ఐస్​క్రీంను తానే తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి గురించి.. తన వ్యాపారం గురించి.. రోజు మొత్తం అమ్మితే తనకెంత వస్తుందంటూ సరదాగా సంభాషించారు. ఆ సమయానికే మంత్రిని చూసి ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ఇంకేముంది.. డబ్బాలోని మొత్తం ఐస్​క్రీంలకు డబ్బులు చెల్లించి... తను ఆస్వాదించటమే కాకుండా అక్కడికి చేరుకున్న ప్రజలకు కూడా ఐస్​క్రీం రుచి చూపించి ఆనందించారు. మంత్రి హోదాలో ఉండి కూడా.. చిన్న పిల్లాడిలా మారి బండి దగ్గర ఐస్​క్రీం కొనుక్కున్న సన్నివేశం చూసి.. ప్రజలు ఆశ్చర్యంతో పాటు ఆనందం వ్యక్తం చేశారు.

రోడ్డు మీద ఐస్​క్రీం కొనుక్కుని.. చిన్నపిల్లాడిలా మురిసిపోయిన మంత్రి

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.