ETV Bharat / state

త్వరలోనే మామునూరు విమానాశ్రయాన్ని పునరుద్ధరిస్తాం: ఎర్రబెల్లి - మామునూరు విమానాశ్రయం వార్తలు

వరంగల్‌ మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్‌ నాయకత్వంలో పదే పదే కేంద్రానికి చేసిన విజ్ఞప్తులు ఫలించడంతో... కదలిక వచ్చిందని తెలిపారు. త్వరలోనే విమానాశ్రయాన్ని పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. విమానాశ్రయ ప్రాంతాన్ని, రన్ వేను మంత్రి పరిశీలించారు.

ERRABELLI
ERRABELLI
author img

By

Published : Aug 31, 2020, 1:59 PM IST

వరంగల్ మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణ త్వరలోనే జరుగుతుందని... మంత్రి ఎర్రబెల్లి దయకరరావు అన్నారు. విమానాశ్రయ ప్రాంతాన్ని, రన్ వేను మంత్రి పరిశీలించారు. అవసరమైన స్థల సేకరణపై జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో మాట్లాడారు. మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని మంత్రి విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్‌ నాయకత్వంలో పదే పదే కేంద్రానికి చేసిన విజ్ఞప్తులు ఫలించడంతో... కదలిక వచ్చిందని తెలిపారు.

విమానాశ్రయం కోసం కావాల్సిన అదనపు స్థల సేకరణ కూడా త్వరలో పూర్తవుతుందని... రైతులకు ప్రత్యమ్నాయంగా భూమి, డబ్బులు ఏదంటే అది ఇస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. ఎంతో చరిత్ర గల మామునూర్‌ విమానాశ్రయ పునరుద్ధరణతో వరంగల్‌ మరింత అభివృద్ధి చెందుతుందని... ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. మంత్రి వెంట నగర మేయర్ గుండా ప్రకాశరావు, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్‌, చల్లా ధర్మారెడ్డి తదితరులు వెంట ఉన్నారు.

ఇదీ చదవండి: స్వచ్ఛమైన గాలి.. మట్టివాసన... ఫామ్‌టూర్స్‌కు నగరవాసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.