వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్లోని ఫిల్టర్ బెడ్ పనులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికీ శుద్ధిచేసిన స్వచ్ఛమైన నీటిని అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టుని మొదలు పెట్టారని మంత్రి కొనియాడారు. మిషన్ భగీరథ పథకాన్ని చూసే.. కేంద్ర ప్రభుత్వం జల జీవన్ మిషన్ అనే పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు.
మిషన్ భగీరథ మంచినీటి ప్రాజెక్టుని 46 వేల కోట్ల రూపాయల అంచనాలతో ప్రారంభించగా... ఇంజనీర్ల నైపుణ్యం కృషి ఫలితంగా రూ.34 వేల కోట్లతో... 3 సంవత్సరాల కాలంలోనే పూర్తి చేశారని వెల్లడించారు. మిషన్ భగీరథ ద్వారా శుద్ధిచేసిన నీరు... స్వచ్చమైనదని ప్రయోగపూర్వకంగా నిరూపించామని తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు... ఇకపై అన్ని అధికారిక కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ నీటినే తాగే విధంగా చూస్తామని మంత్రి తెలిపారు.
ఇదీ చూడండి: 'మార్చి నాటికి ప్రతి పల్లెకు తాగునీరు అందిస్తాం'