ETV Bharat / state

Errabelli at Inavolu Mallanna jatara : ఐనవోలు మల్లన్నను దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి

elli at Inavolu Mallanna jatara : ఐనవోలు మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. ఇవాళ శ్రీ మల్లికార్జున స్వామిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

Errabelli at Inavolu Mallanna jatara, errabelli in inavolu
ఐనవోలు మల్లన్నను దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి
author img

By

Published : Jan 23, 2022, 12:26 PM IST

Updated : Jan 23, 2022, 12:55 PM IST

elli at Inavolu Mallanna jatara : సంక్రాంతి అనంతరం వచ్చిన మొదటి ఆదివారం కావడంతో ప్రముఖ పుణ్యక్షేత్రం హనుమకొండ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి సన్నిధికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి జనం తరలివచ్చారు. కోర మీసాల మల్లన్నను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా సోకడంతో.. సంక్రాంతికి స్వామి వారిని దర్శించుకోలేక పోయానన్న మంత్రి... కొవిడ్‌ మహమ్మారి నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించాలని కోరినట్లు తెలిపారు. ఎర్రబెల్లికి ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. మంత్రి వెంట స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేష్, డీసీసీబీ ఛైర్మన్ మార్నెని రవీందర్ రావు తదితరులు ఉన్నారు.

Errabelli at Inavolu Mallanna jatara, errabelli in inavolu
మల్లన్న సన్నిధిలో ఎర్రబెల్లి

సల్లగ సూడు మల్లన్న

ఆదివారం కావడంతో మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. సంక్రాతి సందర్భంగా జరిగే మూడు రోజుల జాతరకు రాలేక పోయిన భక్తులు...వారాంతం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. కుటుంబసమేతంగా వచ్చి... మొక్కులు తీర్చుకున్నారు. ఎత్తు బోనాలు నైవేద్యంగా సమర్పించి... సల్లగా చూడు మల్లన్న అంటూ పబ్బతి పట్టారు. పాడి పంట, పిల్లాపాపలు చల్లగా ఉండాలని కోరమీసాల మల్లన్నను కోరుకున్నారు.

కరోనా భయంతో సంక్రాంతి జాతరకు రాలేదు. అప్పుడు జనాలు ఎక్కువ మంది ఉంటారని అనుకున్నాం. ఇవాళ కూడా ఎక్కువమంది వచ్చారు. మేం ప్రతి ఏడు వచ్చి మల్లన్నను దర్శించుకుంటాం. దర్శనం బాగా జరిగింది.

-భక్తులు

మేం ప్రతి సంవత్సరం సంక్రాంతి జాతరకు వస్తాం. భోగి రోజునే వచ్చి మల్లన్నను దర్శించుకుంటాం. జాతర అప్పుడు ఎక్కువ మంది ఉంటారని అప్పుడు రాలేదు. ఇవాళ కూడా ఎక్కువ మంది వచ్చారు. అయినా మంచిగా దర్శనం జరిగింది. సౌకర్యాలు బాగా ఉన్నాయి. ఒకప్పటి కంటే ఇప్పుడు ఆలయం శుభ్రంగా ఉంది. మేం 28 ఏళ్ల నుంచి మల్లన్నను దర్శించుకుంటున్నాం. మేం కోరిన కోరికలు మల్లన్న తీరుస్తాడు. అందుకే ఏటా వస్తాం.

-భక్తులు

ఐనవోలు మల్లన్న ఉత్సవాలు సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరుగుతాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది. ఆలయ ఆవరణం చాలా పరిశుభ్రంగా ఉందని భక్తులు అంటున్నారు.

ఐనవోలు మల్లన్నను దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి

ఇదీ చదవండి: Shivaratri Brahmotsavam in srisailam : ఫిబ్రవరి 22 నుంచి శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు

Last Updated : Jan 23, 2022, 12:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.