ETV Bharat / state

తెరాస విజయమే లక్ష్యంగా పని చేయాలి: ఎర్రబెల్లి

జీడబ్యూఎంసీ ఎన్నికలపై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు సమీక్ష నిర్వహించారు. ఈ ఎన్నికల్లో తెరాస విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.

Minister errabelli
Minister errabelli
author img

By

Published : Apr 20, 2021, 8:25 PM IST

గ్రేటర్​ వరంగల్ ఎన్నికల్లో తెరాస విజయమే లక్ష్యంగా పని చేయాలని పార్టీ నేతలు, శ్రేణులకు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. వందకు వంద శాతం ఫలితాలు ఉండే విధంగా చూడాలని పార్టీ నేతలకు ఉద్బోధించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నివాసంలో జీడబ్యూఎంసీ ఎన్నికలపై పశ్చిమ నియోజకవర్గం పరిస్థితులపై ముఖ్య నేతలతో మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్​పల్లి వినోద్ కుమార్, పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంఛార్జి గ్యాదరి బాలమల్లు, మాజీ ఎంపీ గుండు సుధారాణి, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, స్టేషన్ ఘన్​పూర్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్య మంత్రి తాటికొండ రాజయ్య తదితరులు హాజరయ్యారు.

గ్రేటర్​ వరంగల్ ఎన్నికల్లో తెరాస విజయం ఖాయమన్నారు. అన్ని సర్వేలు అనుకూలంగా ఉన్నాయన్నారు. బోగస్ మాటల భాజపా అడ్రస్ గల్లంతు చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ ఎన్నికలను సీరియస్​గా తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.

ఇదీ చదవండి: రాత్రి కర్ఫ్యూ వల్ల ఒరిగేదేం లేదు: భట్టి విక్రమార్క

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.