ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హన్మకొండలోని కలెక్టరేట్లో జిల్లా వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తి, నివారణ చర్యలపై చర్చించారు. కొవిడ్ చికిత్సకు అవసరమైన రెమ్డెసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్ సరఫరా జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా అన్ని వస్తువులు సమకూరుస్తున్నామని మంత్రి చెప్పారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో వరంగల్లో మరో పెద్ద సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఎంజీఎం ఆస్పత్రిలో కొవిడ్ బాధితులకు అవసరమైన సమాచారం కోసం హెల్ప్ లైన్ నెంబర్ 7901618231 ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయభాస్కర్, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్, ఎమ్మెల్యేలు, వైద్యాధికారులు పాల్గొన్నారు.
- ఇదీ చదవండి వరుడు రెండో ఎక్కం చెప్పలేదని పెళ్లి రద్దు