ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం తీసుకొచ్చిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మిషన్ భగీరథ జలం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం సురక్షితమైనదిగా గుర్తింపు పొందినదని మంత్రి పేర్కొన్నారు. వరంగల్‌లోని తన క్యాంపు కార్యాలయంలో భగీరథ వాటర్ బాటిల్‌ను ఆయన ప్రారంభించారు.
భగీరథ జలాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అందిస్తున్నట్లు తెలిపారు. ముందుగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు నీటిని సరఫరా చేస్తునట్లు వివరించారు. ప్రజలందరూ పరిశుభ్రమైన మిషన్ భగీరథ నీటిని వినియోగించాలని పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి: ఈ చిన్నారుల గణతంత్ర వేడుకలు.. ఎందరికో ఆదర్శం