వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని పలు విభాగాలను సందర్శించిన ఆయన రోగులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమయపాలన పాటించని వైద్యులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులకు మెరుగైన వైద్యం అందించి, ఆస్పత్రి అభివృద్ధికి కృషి చేయాలని సూపరింటెండెంట్ శ్రీనివాస్‌కు సూచించారు. త్వరలోనే ఎంఆర్ఐ సిటీ స్కాన్ అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.
- ఇదీ చూడండి : పాలమూరులో కేసీఆర్... ప్రాజెక్టు పనుల పరిశీలన