ETV Bharat / state

కరోనా సేవలనూ రాజకీయం చేయడం దురదృష్టకరం: ఎర్రబెల్లి - సేవల పరిశీలనకు కలిసి రావాలని ఎర్రబెల్లి సవాల్‌

ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లొద్దని చెప్పి పేద ప్రజలను ఆందోళనకు గురిచేయడమే కాంగ్రెస్ యోచనగా కనిపిస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. కరోనా బాధితులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న సేవల పరిశీలనకు తనతో కలిసి రావాలని హన్మకొండలో సీఎల్పీ నేత బట్టి విక్రమార్కకు సవాల్‌ చేశారు.

minister errabelli dayakar rao fire on congress leaders in hanamkonda warangal urban district
సేవల పరిశీలనకు కలిసి రావాలని ఎర్రబెల్లి సవాల్‌
author img

By

Published : Aug 31, 2020, 4:08 PM IST

కరోనా రోగులకు అందుతున్న వైద్యాన్ని కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు విమర్శించారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలో అంబులెన్స్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఎంజీఎం సహా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పాజిటివ్ సోకిన వ్యక్తులకు మెరుగైన వైద్యం అందుతోందన్న ఆయన.. సేవల పరిశీలనకు కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క తనతో కలసి రావాలని సవాల్ చేశారు.

ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న వైద్యసిబ్బందిపై దాడులు చేయడం ఎంతవరకూ సమర్ధనీయమని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లొద్దని చెప్పి పేద ప్రజలను ఇక్కట్ల కాంగ్రెస్ యోచనగా కనిపిస్తోందని అన్నారు.

ఇదీ చదవండి:ఆన్​లైన్ ఓనం: వేడుకల్లో అబ్బురపరిచిన చిన్నారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.