Cooperative Society Meeting: హనుమకొండలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో నిర్వహించిన సహకార సంఘ వారోత్సవాల ముగింపు సందర్భంగా, డీసీసీ బ్యాంకు ఆర్థిక ప్రగతిపై సమీక్షించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాలకు అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.
డీసీసీబీ బ్యాంకు రైతులకు మెరుగైన సేవలు అందిస్తుందని అభినందించారు. రైతులకు నేరుగా సేవ చేసే అవకాశం సహకార సంఘాలకు ఉంటుందన్నారు. గత పాలక వర్గం డీసీసీబీ బ్యాంకును లూటీ చేసిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం డీసీసీబీ బ్యాంకులను లాభాల్లోకి తీసుకొచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ మర్నేని రవీందర్రావు, బ్యాంకు డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: