వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రుద్రేశ్వరున్ని దర్శించుకుని అభిషేకాలు చేశారు. రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని శివున్ని ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని దేవాలయాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయంలో చేసిన ఏర్పాట్లపై హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: వైభవంగా శివరాత్రి.. శైవాలయాల్లో భక్తుల సందడి