ETV Bharat / state

Micro Artist Srijith : మైక్రో ఆర్ట్స్​తో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్న యువకుడు - micro artist sujith making amzing scuptures

Hanamkonda Micro Artist : నేటితరం యువత ఆలోచనలు విభిన్నంగా ఉంటున్నాయి. అందుకే చదువులో మేటిగా ఉంటూనే ఏదొక రంగంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అలా కొందరు ఆటలు...ఇంకొందరు...ఫొటోగ్రఫీ, పెయింటింగ్... ఇలా...ఎవరికి నచ్చిన దాంట్లో వాళ్లు నైపుణ్యం సంపాదిస్తున్నారు. ఈ కోవకే చెందుతాడు ఈ యువ కళాకారుడు. సందేశాత్మక చిత్రాలతోపాటు జీవత్వం ఉట్టిపడేలా సూక్ష్మ కళాకృతులు తయారు చేసి... ప్రతిభ, ప్రదర్శిస్తున్నాడు. అందరితో ఔరా అనిపించుకుంటున్న ఆ యువ కళాకారుడి కథనం ఇది.

Micro Artist Srijith From Hanumakonda
మైక్రో ఆర్ట్స్​తో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్న యువకుడు
author img

By

Published : Jun 3, 2023, 12:32 PM IST

మైక్రో ఆర్ట్స్​తో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్న యువకుడు

Hanamkonda Micro Artist Sujith : ఈ యువకుడికి ఆర్ట్‌ అంటే చాలా ఇష్టం. కానీ తెలిసిన వారంతా అందులో ఏం ఉంటుంది వద్దన్నారు. ఐనా తన మనసాగలేదు. పట్టువీడకుండా కళపై సాధన చేశాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ప్రోత్సాహంతో చదువుల్లో రాణిస్తూ మంచి ఆర్టిస్ట్‌గా ఎదుగుతున్నాడు. సందేశాత్మక కళాకృతులు రూపొందిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నాడు ఈ యువ కళాకారుడు.

Micro Artist Sujith : పెన్సిల్‌పై చక్కటి కళాకృతులు తయారు చేస్తున్నఈ యువకుడి పేరు శ్రీజిత్. హనుమకొండ జిల్లా గోపాల్‌పూర్‌లోని అరుణోదయ కాలనీలో ఉంటున్న ఓ సాధారణ కుటుంబానికి చెందినవాడు. ఓ కళాశాలలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్న ఇతడికి....కళలంటే మక్కువ ఎక్కువ. దాంతో ఓ వైపు చదువుతూనే మరోవైపు అద్భుత కళాకృతులను సృష్టిస్తున్నాడు. శ్రీజిత్ 8వ ఏట నుంచే ఈ కళాకృతులు తయారు చేయడం నేర్చుకున్నాడు. తొలుత సరదాగా మొదలుపెట్టినాతరువాత.... దీక్షగా చేయడం ప్రారంభించాడు. తన మేన మామ, తండ్రి, ఇతర కళాకారులు ఇచ్చిన పోత్సహంతో మరింత ఉత్సాహం తెచ్చుకుని అనేక కళాకృతు లు అందంగా తయారు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు ఈ యువకుడు.

"పెన్సిల్, చాక్​పీస్ మీద వేస్తుంటాను. ఆబ్జెక్ట్​ను బట్టి మెటీరియల్ మారుతూ ఉంటుంది. ఈ మైక్రో ఆర్ట్స్​ అనేవి మా మామయ్య నుంచి నేర్చుకున్నాను. బియ్యపు గింజపై జాతీయ జెండాను వేశాను. చాలెంజింగ్​గా తీసుకుని 15నిమిషాల్లో జెండాను వేశాను. ఒక్క ఆర్ట్ వేయాలంటే గంటపైనే సమయం పడుతుంది. 108 లింగాలను గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించాలని చేశాను." - శ్రీజిత్, కళాకారుడు

పెన్సిల్‌పైనే కాక చాక్‌పీస్‌, బియ్యం గింజలపై తన ప్రతిభను చాటుతున్నాడు శ్రీజిత్‌. మాతృదినోత్సవం రోజున 12 మిల్లీ మీటర్ల ఎత్తులో బిడ్డను లాలిస్తున్నతల్లి బొమ్మను చెక్కాడు. బియ్యం గింజపై జాతీయ జెండా రూపొందించాడు. అది కూడా 6 మిల్లీ మీటర్ల ఎత్తుతో 15 నిమిషాల్లో పూర్తి చేశాడు. చాక్‌పీస్‌ పై 108 శివలింగాలను రోజుకి 2 గంటలు శ్రమించి , 7 రోజుల్లో తయారు చేశారు.

"మొదట్లో ఒక ఆర్ట్ వేయడానికి నాలుగైదు గంటల సమయం పట్టేది. ప్రాక్టీస్ చేస్తూ ఉండటం వల్ల ప్రస్తుతం ఒకటి రెండు గంటల్లో వేయగలుగుతున్నాను. ఆర్ట్స్​ అనేవి అంత సులభంగా రావు. నేను ఎంతో ఇష్టంతో ఈ మైక్రో ఆర్ట్స్​ అనేవి నేర్చుకున్నాను. చాలా మంది యువత ఆర్ట్స్ నేర్చుకోవాలనుకున్నప్పుడు కుటుంబ, బంధువుల మాటల వల్ల దాని నుంచి డ్రాప్ అవుతుంటారు. నేను కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను. నా చదువును, ఆర్ట్స్​ను రెండింటిని కొనసాగిస్తూ ముందుకెళతాను." - శ్రీజిత్‌, కళాకారుడు

చదువుతో పాటు మైక్రో ఆర్ట్స్ : తన ప్రతిభ, నైపుణ్యాలకు సృజనాత్మకతను జోడిస్తూ మరెన్న కళాకృతులు తయారు చేస్తున్నాడు శ్రీజిత్‌. చాక్‌పీస్‌పై మహత్మాగాంధీ బొమ్మ అద్భుతంగా చేసి ప్రశంసలు పొందాడు. ఈ ఆకృతులను తయారు చేయానికి మొదట్లో కాస్త ఎక్కువ సమయం తీసుకున్నా....ఆ తర్వాత సాధనతో గంటలోపే పూర్తి చేయడం నేర్చుకున్నాడు. ఇటు చదువును నిర్లక్ష్యం చేయకుండానే తన ఇష్టమైన కళలో రాణిస్తున్నాడు. శ్రీజిత్‌.. మెుదట ఈ కళను నేర్చుకుంటుంటే చాలామంది సన్నిహితులు వద్దన్నారు. కానీ నా మనసు చెప్పిన మాట వినాలని ఇటు వైపు అడుగులు వేశానని అంటున్నాడు. సృజనాత్మకతపై యువతకు మక్కువ ఉన్నా.. తగిన ప్రోత్సాహం లభించక చాలామంది వెనకడుగులు వేస్తున్నారని .. కానీ నేను అలా చేయవద్దని అనుకున్నానని చెబుతున్నాడు ఈ కళాకారుడు.

గిన్నిస్ రికార్డ్ సాధించాలని లక్ష్యం : తన ప్రతిభ, నైపుణ్యాలతో మినిస్టరీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ కల్చర్‌ నుంచి సత్కారంతో పాటు ప్రశంసలు అందుకున్నాడు శ్రీజిత్‌. అదే కళలో వినూత్నంగా ఆలోచించి గిన్నిస్‌బుక్‌లో స్థానం సంపాదించాలన్నది లక్ష్యమని శ్రీజిత్ అంటున్నాడు. కళను పెంపొదించుకోవడంతోపాటుగా చదువు నిర్లక్ష్యం చేయకూడదని అంటున్నాడు శ్రీజిత్ . భవిష్యత్తులో తను చేసిన సందేశాత్మక ఆకృతులతో ఓ అందమైన ప్రదర్శన నిర్వహిస్తానని చెబుతున్నాడు ఈ యంగ్ ఆర్టిస్ట్‌.

ఇవీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.