చారిత్రక నగరం ఓరుగల్లులో మహాత్ముని పేరుతో వెలసిన ఎంజీఎం ఆసుపత్రిలో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెలకు 90వేల నుంచి లక్ష వరకూ ఓపీలో వైద్య సేవలు పొందుతున్నా.. వసతులు మాత్రం అరకొరగానే ఉన్నాయి. సరిపడా వైద్యులు లేరు. సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో వైద్యుల కొరత మరీ అధికం. శస్త్ర చికిత్సలు జరగట్లేదు. రోగులకు సరిపడా పడకలు లేవు. వెంటిలేటర్లు, మానిటర్లు, ఎక్స్రే మిషన్లు పాడైపోయాయి.
ఆసుపత్రిలో తాగునీటి సమస్య అధికం. వేసవి కాలానికి సరిపడా మంచినీరు అందించేందుకు.. మూడు వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాల్సిఉంది. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం తర్వాతైనా సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజలు ఆశిస్తున్నారు.