Medaram Jatara Arrangements In Telangana : దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఆదివాసీ గిరిజన జాతరగా జయశంకర్ భూపాలపల్లి(Jayashankar Bhupalpally) జిల్లాలోని మేడారం జాతర పేరొందింది. నాలుగు రోజుల పాటు వనమంతా జనమై వన దేవతలను దర్శించుకుంటారు. తెలుగు రాష్ట్రాలు సహా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. దీంతో నాలుగు రోజుల పాటు మేడారం పరిసరాలు కోలాహలంగా మారతాయి. జంపన్న వాగులో స్నానాలాచరించి తల్లులను దర్శించుకొని బంగారాన్ని కానుకలుగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు.
Revanth Reddy: 'మేడారం జాతరకూ జాతీయ పండుగ హోదా ఇవ్వాల్సిందే'
Medaram Fair Start From February 21 to 24 : ప్రతి రెండేళ్లకోసారి మేడారం మహా జాతర వైభవంగా సాగుతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ఈ మహా జాతర జరగనుంది. కోటిన్నర మందికి పైగా భక్తులు తరలివచ్చే అవకాశమున్న ఈ జాతర కోసం రూ.75 కోట్లతో 21 శాఖల అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి సర్కార్‌కు పంపినా ఎన్నికల కారణంగా అది ఆమోదం కాలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతర కోసం రూ.75 కోట్ల విడుదలకు ఆమోదం తెలపడంతో ఇక జాతర పనులు వేగవంతం కానున్నాయి.
ఫిబ్రవరి 21 నుంచి జాతర : 2022లో మేడారం జాతర జరగగా మళ్లీ 2024లో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 14న మాఘశుద్ధ పంచమి రోజున మండె మెలిగె, గుడి శుద్ధీకరణ క్రతువుతో జాతర ప్రారంభం కానుంది.
Medaram Sammakka Saralamma Jatara 2024 : జాతరలో మొదటిరోజు కన్నెపల్లి ప్రాంతం నుంచి సారలమ్మను గద్దె పైకి తీసుకువస్తారు. ఆ తరువాతి రోజు చిలకలగుట్ట దగ్గర ఉన్న సమ్మక్కను తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్ఠాపన చేస్తారు. మూడో రోజు భక్తులు గిరిజన తల్లులు సమ్మక్క సారలమ్మను కొలుస్తారు. నాలుగు రోజు అమ్మవార్లు తిరిగి వన ప్రవేశం చేస్తారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ మహా జాతరకు కోట్లాది జనం వస్తుండగా జాతరకు జాతీయ హోదా కల్పించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది.
మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కోసం కృషి : సీతక్క
Medaram Jatara 2024 : జంపన్నవాగు వద్ద భక్తుల కోసం స్నాన ఘట్టాలు, మేడారానికి దారితీసే రహదారులను బాగు చేయాల్సి ఉంది. మంచినీటి, పారిశుద్ధ్యంపైనా దృష్టి పెట్టాలి. వైద్య శిబిరాలు, 24 గంటల విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేయాలి. కళ్యాణ కట్టలు, పార్కింగ్ స్ధలాలను సిద్ధం చేయాలి. మహా జాతరకు కనీసం 6 నెలల ముందుగానే ఏర్పాట్లు జరగాల్సి ఉన్నా ఎన్నికల కారణంగా ఆలస్యమైంది. ప్రస్తుతమైతే జాతరకు కేవలం రెండు నెలలే సమయముంది. దీంతో గడువులోగా పనుల పూర్తి చేయడం అధికారులకు పెద్ద సవాలే.
జనమయమైన జంపన్న వాగు.. పుణ్యస్నానాలతో పునీతులవుతున్న భక్తులు..