నేటి నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో కన్వీనర్ కోటా కింద ప్రవేశాల రెండోవిడత వెబ్కౌన్సిలింగ్ ప్రారంభంకానుంది. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి ఈనెల 19 మధ్యాహ్నం వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని కాళోజీ యూనివర్సిటీ తెలిపింది. అదే రోజు రాత్రి ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ నెల 6న ప్రకటించిన అర్హులైన అభ్యర్థుల జాబితాలో చోటు దక్కిన వారు మాత్రమే రెండో విడత ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అభ్యర్థులు ప్రాధాన్యక్రమంలో వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని యూనివర్సిటీ పేర్కొంది. కళాశాలల్లో చేరటానికి ఈ నెల 24వరకు తుదిగడువుగా నిర్ణయించే అవకాశాలున్నాయి. అఖిలభారత కోటాలో మిగిలిన సీట్లను ఈ నెల 25న రాష్ట్రానికి ఇవ్వనున్నారు. ఈ సీట్లనూ, రెండో విడతలో మిగిలిన వాటిని కలిపి మూడో విడత ప్రవేశాల్లో భర్తీ చేస్తారు.
ఇవీచూడండి: నేడే కేబినేట్ సమావేశం