ETV Bharat / state

'గతంలో చేసిన నిధులే రాలేదు.. ఇప్పుడు పట్టణ ప్రగతిలో ఏం చేయాలి' - వరంగల్​లో మహా నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం

వరంగల్​ మేయర్​ గుండా ప్రకాశ్​ నేతృత్వంలో ఏర్పాటైన మహా నగరపాలక సంస్థ కౌన్సిల్​ సమావేశం వాడివేడిగా జరిగింది. అధికార పార్టీ కార్పొరేటర్.. ప్రజా ప్రతినిధుల తీరును సభాముఖంగా ప్రశ్నించడం అందరినీ విస్మయానికి గురిచేసింది.​

mayar gunda prakash organized gwmc meeting in warangal
'గతంలో చేసిన నిధులే రాలేదు.. ఇప్పుడు పట్టణ ప్రగతిలో ఏం చేయాలి'
author img

By

Published : Feb 23, 2020, 1:20 PM IST

వరంగల్ మహా నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా సాగింది. మేయర్ గుండా ప్రకాష్ నేతృత్వంలో ఏర్పాటైన సమావేశానికి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్​లోని 58 డివిజన్లకు చెందిన కార్పొరేటర్లతోపాటు బల్దియా అధికారులు హాజరయ్యారు. పట్టణ ప్రగతికై ఏర్పాటైన ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు బండ ప్రకాశ్​ హాజరుకాగా శాసనసభ్యులు గైర్హాజరయ్యారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గత మూడు బడ్జెట్లలో వరంగల్ మహా నగర పాలక సంస్థకు తొమ్మిది వందల కోట్లను కేటాయించారని కేవలం 83 కోట్లను మాత్రమే విడుదల చేశారని..నిధులను రాబట్టడంలో ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని అధికార పార్టీ కార్పొరేటర్ రవీందర్ మేయర్ ఎదుట ఆవేదన వెళ్లబుచ్చారు. 2016-17 సంవత్సరంలో ప్రతిపాదించిన పనుల ఇప్పటికీ కాలేదని కార్పొరేషన్ టెండర్లంటేనే కార్పొరేటర్లు బెంబేలెత్తుతున్నారు అని వ్యాఖ్యానించారు.

గతంలో చేసిన పనులకు నిధులు విడుదల కాకపోవడం వల్ల కార్పొరేషన్ పనులు చేసేందుకు గుత్తేదారులు ముందుకు రావడం లేదన్నారు. ఇప్పుడు పట్టణ ప్రగతిపై ఏ విధమైన ప్రతిపాదనలు చేయాలో పాలుపోవడం లేదని తెలిపారు. అభివృద్ధికి సహకరించని వారి పదవులు ఉండవని చెబుతున్న అధిష్ఠానం.. నిధులను విడుదల చేస్తే అభివృద్ధి జరుగుతుందని సమావేశంలో అధికార పార్టీ కార్పొరేటర్ వ్యాఖ్యానించండం వల్ల ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు, అధికారులు విస్మయానికి గురయ్యారు.

'గతంలో చేసిన నిధులే రాలేదు.. ఇప్పుడు పట్టణ ప్రగతిలో ఏం చేయాలి'

ఇదీ చదవండిః అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేయాలి: వెంకయ్యనాయుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.