ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెకు మందకృష్ణ మాదిగ హన్మకొండలోని ఎకశిలా పార్కులో కార్మికులు చేస్తున్న ఆందోళనలో మంగళవారం పాల్గొన్నారు. ఖమ్మం ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి, కండక్టర్ సురేందర్ గౌడ్ చనిపోవడం చాలా బాధకరమని మందకృష్ణ అన్నారు. ఎప్పటికైనా ఆర్టీసీ కార్మికులు తెగించి పోరడాలి కానీ ప్రాణాలు తీసుకోవద్దని సూచించారు. సీఎం కేసీఆర్ చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించే దిశగా వ్యవహరించాలన్నారు.
ఇదీ చూడండి : బయోకెమి"కిల్స్"... పుట్టగొడుగుల్లా పురుగుమందుల ఉత్పత్తులు!