వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్ గ్రామానికి చెందిన ఆర్టీసీ మహిళ కండక్టర్ లత మహేశ్వరి నిన్న గుండెపోటుతో మృతిచెందింది. ఇవాళ ఆర్టీసీ ఐకాస నాయకులంతా కలిసి ఆమె మృతదేహానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబాన్ని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మంద కృష్ణ మాదిగ, భాజపా రాష్ట్ర నాయకులు ఇనుగాల పెద్దిరెడ్డి పరామర్శించారు. ఇప్పటికీ కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు నడుచుకోవడం బాధాకరమన్నారు. ఆర్టీసీ కార్మికులకు అండగా మేము ఉన్నామని, ఎవరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని వెల్లడించారు.
ఇవీ చూడండి: జీవితంలో రాణించలేనేమోనని ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య