ETV Bharat / state

ఆలోచనకు రంగులద్ది.. ముగ్గులతో ఫిలిం సిటీ ప్రవేశం పాస్‌లు పొందిన విద్యార్థులు - ఈనాడు అధ్వర్యంలో ముగ్గుల పోటీలు

Makar Sankranti Rangoli Event: సంక్రాంతి వచ్చేస్తోంది. అందమైన రంగవల్లులతో తెలుగు లోగిళ్లు... ముచ్చటగొలుపుతున్నాయి. సంక్రాంతి సంబురాలను పురస్కరించుకుని ఈనాడు ఈఎఫ్ఎం 104.8 ఆధ్వర్యంలో హనుమకొండలో నిర్వహిస్తున్న రంగోలి పోటీలు... ఆద్యంతం ఉత్సాహ భరితంగా జరిగాయి. కళాశాలల విద్యార్ధినులు పోటీ పడి రంగవల్లులను తీర్చిదిద్ది... బహుమతులు అందుకున్నారు.

Makar Sankranti
Makar Sankranti
author img

By

Published : Jan 10, 2023, 10:07 PM IST

Makar Sankranti Rangoli Event: నిత్యం పుస్తకాలతో తరగతి గదుల్లో కుస్తీలు పడే విద్యార్ధులు... తమ సృజనాత్మకతను వెలికితీసి అందమైన ముగ్గులను తీర్చిదిద్దారు. సంక్రాంతి సందర్భంగా హనుమకొండ తాళ్ల పద్మావతి ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈనాడు ఈఎఫ్‌ఎం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ముచ్చటగొలిపేలా ముగ్గుల అలంకరణలో విద్యార్థినులు పోటీ పడ్డారు. విజేతలకు ఈ ఎఫ్‌ఎం బృందం బహుమతులు ప్రదానం చేసింది. అనంతరం కళాశాల ప్రాంగాణంలో పతంగులు ఎగరేసి సంప్రదాయాన్ని చాటారు. పోటీల్లో పాల్గొన్నవారికి రామోజీ ఫిలిం సిటీ ప్రవేశ పాస్‌లను అందించారు.

ఆలోచనకు రంగులద్ది.. ముగ్గులతో ఫిలిం సిటీ ప్రవేశం పాస్‌లు పొందిన విద్యార్థులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.