లాక్డౌన్ మినహాయింపు సమయంలో వరంగల్లో రహదారులపై రద్దీ నెలకొంది. ఆదివారం కావడం వల్ల మాంసం, చేపల మార్కెట్లు, మద్యం దుకాణాల వద్ద జనం బారులు తీరారు. కరోనా నిబంధనలు గాలికొదిలేశారు. ఉదయం పది గంటల తర్వాత వాహనదారులను పోలీసులు కట్టడి చేశారు. తనిఖీలు ముమ్మరం చేసి... అనవసరంగా బయటకు వచ్చిన వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
హన్మకొండ, వరంగల్, కాజీపేటల్లోని అన్ని కూడళ్ల వద్ద పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. పాసులు ఉన్న వాహనాలనే అనుమతించారు. లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నామని... అనవసరంగా బయటకు వస్తే వాహనాలు సీజ్ చేస్తున్నట్లు సీపీ తెలిపారు. వరంగల్ గ్రామీణ, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోనూ పది గంటల తరువాత తిరిగే వాహనదారులపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: కలెక్టర్ అత్యుత్సాహం- యువకుడి చెంప చెళ్లు!