వరంగల్ అర్బన్ జిల్లాలోని కాజీపేట్, ధర్మసాగర్, వేలేరు మండలాల్లో ఈ రోజు మధ్యాహ్నం తేలికపాటి చిరుజల్లులు కురిశాయి. ఇన్ని రోజులు ఎండలతో అల్లాడిన జనాలు వర్షం రాకతో ఒక్కసారిగా ఉపశమనం పొందారు. అయితే వర్షాకాలం మొదలై ఇన్ని రోజులు గడిచినప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు లేక రైతన్నలు మాత్రం దిగాలు చెందుతున్నారు.
ఇవీచూడండి: వైరల్: అసలు చిరుత ఇలా ప్రవరిస్తుందా?