ఈ నెల 19 నుంచి ఆర్టీసీ సేవలకు ప్రభుత్వం అనుమతులివ్వగా... బస్సులు రోడ్డెక్కాయి. కానీ... వరంగల్ రీజియన్‌కు మాత్రం అనుకున్న స్థాయిలో ఆదాయం రావడం లేదు. సాధారణ రోజుల్లో కంటే తక్కువ ఆదాయం సమకూరుతోంది. ఒక వైపు కరోనా... మరో వైపు తీవ్రమైన ఎండల ప్రభావంతో ఆర్టీసీకి ఆదరణ అంతంత మాత్రంగానే ఉంది.
రాత్రి వేళ బస్సులు నడిపే అవకాశం లేకపోవడం, దూర ప్రాంతం, అంతర్రాష్ట్ర సర్వీసులు డిపోలకే పరిమితం కావడం వల్ల గతంలో మాదిరిగా ఆదాయం సమకూరడం లేదు. రోజుకు 78 శాతం ఓఆర్ సాధించాల్సి ఉండగా... ప్రస్తుతం 50 శాతం మించడం లేదు. వరంగల్ రీజియన్‌లోని 9 డిపోల పరిధిలో మొత్తం 968 బస్సులు ఉండగా ఇందులో 61 అంతర్రాష్ట్ర సర్వీసులు డిపోలకే పరిమితమవుతున్నాయి.
సాధారణ రోజుల్లో ఆదాయం రోజుకు కోటికి పైగా రాగా... ప్రస్తుతం 40 లక్షలు వస్తుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. సాధారణ రోజుల్లో 10 లక్షల ప్రయాణికులు తిరుగగా... ఇప్పుడు సుమారు 4 లక్షల ప్రయాణికులు తిరుగుతున్నారు. మొత్తానికి కరోనాకు తోడు తీవ్రమైన ఎండలు ఉండటంతో జనం ఎక్కువగా ప్రయాణాలు జరపడం లేదు.
ఇదీ చూడండి: భారత్, చైనా సరిహద్దు వివాదం- 10 కీలకాంశాలు