కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలోని సంపదను దోచి.. కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టి మన ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం అన్నారు. వరంగల్ పట్టణ జిల్లా పరిధిలోని హన్మకొండలో వామపక్ష పార్టీల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
పరిశ్రమలను ప్రైవేట్ పరం చేయడం వల్లే నిరుద్యోగం పెరిగిందని.. లాక్డౌన్ వల్ల ఇప్పటి వరకు దేశంలో 15 లక్షల ఉద్యోగాలు పోయాయని తమ్మినేని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని ఆరోపించారు. శాసన మండలిలో ప్రజాగొంతు వినిపించేందుకు వామపక్ష అభ్యర్థిని గెలిపించాలంటూ ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, వామపక్ష పక్ష పార్టీలు బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారధి రెడ్డి హాజరయ్యారు.
ఇదీ చూడండి: విష జ్వరాలు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి: ఈటల