కాజీపేట రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో సావిత్రి బాయి పూలే 190వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రభుత్వ ఛీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, ప్రజా గాయని విమలక్క, తదితరులు హాజరయ్యారు. సావిత్రిబాయి పూలే చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించి.. ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు.
మహిళలకు మొదటి పాఠశాల స్థాపించిన సంఘ సంస్కర్తగా సావిత్రిబాయి పూలే అని వినయభాస్కర్ అభివర్ణించారు. ఆనాటి కట్టు బాట్లను ఎదిరించి ఎన్నో హక్కుల కోసం పోరాటం చేసిందని కొనియాడారు. ఆధునిక యుగంలో విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన సావిత్రిబాయి పూలే.. ఆమె భర్త జ్యోతిరావు పూలేతో ఆశయాల సాధనకోసం కృషి చేసిందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి : రోజుకు పదిలక్షల మందికి కరోనా టీకా: మంత్రి ఈటల