వరంగల్ నగరంలోని లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ హమాలీ కార్మికులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనతో మార్కెట్ యార్డులో కూరగాయల మూటలతో వచ్చిన వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రహదారికి అడ్డంగా కూరగాయలు విక్రయించడం వల్ల తమ పనులకు తీవ్ర విఘాతం కలుగుతోంది.. ఈ విషయంపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశామని కార్మికులు తెలిపారు.
మార్కెట్ యార్డులో మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని ఛైర్మన్ వద్ద వాపోయారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. కార్మికులతో మార్కెట్ ఛైర్మన్ చర్చలు జరిపి తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వగా.. ఆందోళన విరమించారు.