మేడారం జాతరకు వెళ్లే భక్తులతో వరంగల్ నగరంలోని లక్ష్మీపురం పండ్ల మార్కెట్లో ఏర్పాటు చేసిన బస్సు ప్రాంగణం కిటకిటలాడుతోంది. వరంగల్ నగరంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తుల రద్దీని గుర్తించిన పోలీసులు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకుండా ముందస్తుగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
ప్రయాణికులను త్వరితగతిన గమ్య స్థానాలకు చేర్చే విధంగా ఆర్టీసీ అధికారులు సర్వీసులను నడిపిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మార్కెట్ ఆవరణలో చలువ పందిళ్లు, సాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి : గద్దెలపై కంకవనం..సాయంత్రం సమ్మక్క దర్శనం..