ఈనాడు క్రికెట్ లీగ్ పోటీలు వరంగల్‌లో తుది దశకు చేరుకున్నాయి. హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న ఈ క్రికెట్ పోటీలు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. క్రీడాకారులు తమ ప్రతిభను కనబరుస్తూ ప్రతి మ్యాచ్‌లో హోరాహోరీగా తలపడుతున్నారు. ఈనాడు కల్పించిన ఈ అవకాశాన్ని యువ క్రీడాకారులు చక్కగా ఉపయోగించుకుంటున్నారు.
బాలుర జూనియర్ విభాగంలో నిజామాబాద్‌కి చెందిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల జట్టు, మహబూబ్‌నగర్‌కి చెందిన వాగ్దేవి జూనియర్ కళాశాలతో తలపడుతుంది. మరో సెమిస్ మ్యాచ్‌లో వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల జట్టు.. నల్గొండకి చెందిన అరోరా జూనియర్ కళాశాల జట్టుతో తలపడుతుంది. సీనియర్ విభాగం ఫైనల్స్‌లో ఎన్ఐటీ వరంగల్‌తో మహబూబ్‌నగర్‌కి చెందిన ఆదర్శ డిగ్రీ అండ్ పీజీ కళాశాల జట్టు తలపడనుంది.
ఇవీ చూడండి: నేటితో ముగియనున్న పురఎన్నికల నామినేషన్ల ప్రక్రియ