ETV Bharat / state

నేటితో ముగియనున్న పురఎన్నికల నామినేషన్ల ప్రక్రియ

author img

By

Published : Jan 10, 2020, 4:44 AM IST

పురపాలక ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ నేటితో ముగియనుంది. మొదటి రోజైన బుధవారం కేవలం 967 నామినేషన్లు రాగా... గురువారం ఏకంగా 4వేల 722 నామపత్రాలు వచ్చాయి. ఇప్పటివరకు మొత్తం 5వేల 689 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. నేడు ఆఖరి రోజు కావడంతో భారీ సంఖ్యలో నామపత్రాలు దాఖలయ్యే అవకాశం ఉంది.

the-nomination-process-for-the-municipalities-that-ends-today
నేటితో ముగియనున్న పురఎన్నికల నామినేషన్ల ప్రక్రియ

పురపాలక ఎన్నికల్లో నామపత్రాల పర్వం ఊపందుకుంది. 9 నగరపాలక సంస్థలు, 120 పురపాలక సంస్థలకు 2 రోజులుగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. మొదటిరోజైన బుధవారం 967 నామినేషన్లు దాఖలు కాగా... రెండో రోజు 4వేల722 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 5వేల 689 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. 143 మంది అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా నామపత్రాలు దాఖలు చేశారు. అధికార తెరాస... గురువారం ఏ ఫారాలు, బీ ఫారాలు పంపిణీ చేసింది. ఇతర పార్టీలు ఇవాళ అభ్యర్థుల్ని ఖరారు చేయనున్నాయి. పోటీ చేసేది ఎవరో స్పష్టత రావడంతో నేడు భారీ సంఖ్యలో నామపత్రాలు వచ్చే అవకాశం ఉంది.

ఏ జిల్లాలో ఎంతంటే?

రెండో రోజైన గురువారం అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 592 నామపత్రాలు రాగా...... 422 నామినేషన్లతో నల్గొండ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. సంగారెడ్డి జిల్లాలో 414, మేడ్చల్లో 387, పెద్దపల్లిలో 386 మంది నామపత్రాలు సమర్పించారు. అత్యల్పంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 16 నామినేషన్లే వచ్చాయి. జగిత్యాల జిల్లాలోని 5పురపాలికల్లో తొలిరోజు కేవలం 78 నామినేషన్లు రాగా... గురువారం 320 నామపత్రాలు దాఖలయ్యాయి. కరీంనగర్జిల్లా హుజూరాబాద్లో 64, జమ్మికుంటలో 66 నామపత్రాలు వచ్చాయి. నిర్మల్జిల్లా భైంసాలో ఎంఐఎం పార్టీ తరపున 15 మంది నామినేషన్లు వేశారు. కొత్తగా ఏర్పడ్డ బాన్సువాడ మున్సిపాలిటీలో నామినేషన్లు వేసేందుకు చాలా మంది ఉత్సాహం చూపారు.

కరీంనగర్​కు గ్రీన్ సిగ్నల్​

అటు హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ఎన్నికల సంఘం కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవాళ స్థానికంగా రిటర్నింగ్ అధికారులు ఎన్నిక నోటీసు ఇస్తారు. నేటి నుంచి ఈనెల 12 వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. 24న పోలింగ్నిర్వహించి, 27న ఓట్ల లెక్కింపు చేపడుతారు.

TG_Hyd_12_10_Nominations_Pkg_3053262 From : Raghu Vardhan ( ) పురపాలక ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ నేటితో ముగియనుంది. గత రెండు రోజులుగా 5689 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో నామపత్రాలు సమర్పించే అవకాశం ఉంది. అటు కరీంనగర్ కార్పొరేషన్లో నామినేషన్ల ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది...లుక్ వాయిస్ ఓవర్ - పురపోరుకు నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. 9 నగరపాలక సంస్థలు 120 పురపాలక సంస్థల్లో వార్డు సభ్యుల ఎన్నిక కోసం గత రెండు రోజులుగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. మొదటిరోజు 967 నామినేషన్లు దాఖలు కాగా... రెండో రోజు 4722 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటివరకు రెండు రోజుల్లో 5689 నామినేషన్లు వార్డు సభ్యుల పదవులకోసం సమర్పించారు. కొంత మంది అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా కూడా నామినేషన్లు సమర్పించారు. 143 మంది అభ్యర్థులు ఇప్పటి వరకు ఆన్ లైన్ ద్వారా కూడా నామ పత్రాలు దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలుకు గడువు ఇవాళ్టితో ముగియనుంది. దీంతో ఇవాళ భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు కానున్నాయి. అధికార తెరాస నిన్న ఏఫారాలు, బీఫారాలు పంపిణీ చేసింది. పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అభ్యర్థుల విషయంలో కొన్నిచోట్ల నిన్నటి వరకు కూడా స్పష్టత రాలేదు. ఇతర పార్టీల్లోని కొన్ని స్థానాలకు సంబంధించిన అభ్యర్థిత్వాలు నిన్నటి వరకు రాలేదు. దీంతో చివరి రోజైన ఇవాళ పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నామినేషన్ల పరిశీలనా ప్రక్రియ రేపు చేపడతారు. అటు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మొదట కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వని రాష్ట్ర ఎన్నికల సంఘం... నిన్న నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవాళ స్థానికంగా రిటర్నింగ్ అధికారులు ఎన్నిక నోటీసు ఇస్తారు. కరీంనగర్ లో కార్పోరేటర్ పదవుల కోసం ఉదయం 10 గంటలా 30 నిమిషాల నుంచి నామ పత్రాల స్వీకరణ ప్రారంభమవుతుంది. అక్కడ ఈనెల 12వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.