KTR Speech at Kakatiya Mega Textile Park : ఉమ్మడి వరంగల్ జిల్లాకు మరిన్ని పరిశ్రమలు తెచ్చి.. పూర్వవైభవం తీసుకొస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నేడు వరంగల్ జిల్లాలో పర్యటించిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న టెక్స్‌టైల్ పార్కుకు శంకుస్థాపన చేశారు. 261 ఎకరాల్లో రూ.900 కోట్లతో యంగ్ వన్ కంపెనీ టెక్స్‌టైల్ పార్కును ఏర్పాటు చేయనుంది. భూమి పూజ అనంతనం మాట్లాడిన కేటీఆర్.. పార్కుకు భూములిచ్చిన అన్నదాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
Minister KTR Latest News : ఈ సందర్భంగా పట్టుబట్టి మరీ వరంగల్‌లో కాకతీయ టెక్స్‌టైల్ పార్కును ఏర్పాటు చేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. చల్లా ధర్మారెడ్డి చొరవ వల్లే వరంగల్‌కు టెక్స్‌టైల్ పార్కు వచ్చిందని తెలిపారు. వరంగల్ జిల్లాలో వచ్చే 3 కంపెనీల వల్ల 33 వేల ఉద్యోగాలు వస్తాయన్న కేటీఆర్.. జిల్లాకు మరిన్ని పరిశ్రమలు తెచ్చి పూర్వవైభవం తెస్తామన్నారు. ఈ క్రమంలోనే గణేశా కంపెనీ ఇప్పటికే రూ.600 కోట్ల పెట్టుబడి పెట్టిందని.. ఆ కంపెనీలో వెయ్యి మందికి ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. యంగ్ వన్ కంపెనీలో మొత్తంగా 11 పరిశ్రమలు వస్తాయని.. తద్వారా వేల ఉద్యోగాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడ నిర్మించే పరిశ్రమల్లో 99 శాతం ఉద్యోగాలు స్థానికులకే వస్తాయని కేటీఆర్ స్పష్టం చేశారు.
కాకతీయ టెక్స్‌టైల్ పార్కుకు భూములిచ్చిన రైతులకు పాదాభివందనం చేస్తున్నా. వరంగల్ జిల్లాలో వచ్చే 3 కంపెనీల వల్ల 33 వేల ఉద్యోగాలు వస్తాయి. జిల్లాకు మరిన్ని పరిశ్రమలు తెస్తాం. వరంగల్‌కు పూర్వవైభవం తీసుకొస్తాం. యంగ్ వన్ కంపెనీలో మొత్తం 11 పరిశ్రమలు వస్తాయి. ఇక్కడి పరిశ్రమల్లో 99 శాతం ఉద్యోగాలు స్థానికులకే వస్తాయి. మేడ్ ఇన్ వరంగల్ దుస్తులు అనేక విదేశాలకు వెళ్తాయి. మన దేశంలో వ్యవసాయ, టెక్స్‌టైల్ రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయి. టెక్స్‌టైల్ రంగంలో మన కంటే బంగ్లాదేశ్, శ్రీలంక ముందున్నాయి. మన దేశం టెక్స్‌టైల్ రంగంలో అనేక సంస్కరణలు రావాలి. తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియాలి. కేంద్రం ఇటీవలే మేల్కొని పీఎం మిత్ర పథకం తెచ్చింది. మనం ఎప్పుడో తెచ్చిన పథకాలను కేంద్రం ఇప్పుడు తెస్తోంది. - మంత్రి కేటీఆర్
మేడిన్ వరంగల్ దుస్తులు అనేక దేశాలకు వెళ్తాయని కేటీఆర్ పేర్కొన్నారు. యంగ్ వన్ కంపెనీ కొరియాలో పెద్ద పరిశ్రమ అని తెలిపారు. ఈ క్రమంలోనే తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియాలని వ్యాఖ్యానించారు. మన దేశంలో వ్యవసాయ, టెక్స్‌టైల్ రంగంలో విస్తృత అవకాశాలున్నాయన్న కేటీఆర్.. టెక్స్‌టైల్ రంగంలో మనకంటే బంగ్లాదేశ్, శ్రీలంక ముందున్నాయని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే మేల్కొని పీఎం మిత్ర పథకం తీసుకొచ్చిందని మంత్రి ఎద్దేవా చేశారు.
ఇవీ చూడండి..
KTR Praises Harish Rao in Siddipet : 'మా బావను అప్పుడప్పుడు సరదాగా ఏడిపిస్తుంటా'
KTR Tweet On Palle Pragathi Day : ఆదర్శ గ్రామాలకు కేరాఫ్ అడ్రస్ 'మన తెలంగాణ'