ETV Bharat / state

మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు: కేటీఆర్

పదోతరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన వారికి వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ విందు పార్టీ ఇచ్చారు. ఈ కార్యక్రమంపై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు.

కలెక్టర్​కు కేటీఆర్ అభినందనలు
author img

By

Published : May 22, 2019, 10:34 AM IST

వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌ను తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలో కష్టపడి చదివి, అత్యుత్తమ ఫలితాలు సాధించిన పదో తరగతి విద్యార్థులకు జిల్లా కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో ఈనెల 19న విందు ఏర్పాటు చేశారు. వారితో కలిసి భోజనం చేశారు. ఈ చిత్రాలను కలెక్టర్‌ వరంగల్‌ అర్బన్‌ డిస్ట్రిక్ట్‌ పేరుతో ఉన్న ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

  • Great move Collector Prashant Patil Garu. I am sure it’ll go a long way in inspiring the kids to dream big 👏👍 https://t.co/tN5dMjqsr6

    — KTR (@KTRTRS) May 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
వీటిని చూసిన కేటీఆర్‌ ప్రశాంత్ జీవన్​కు అభినందనలు తెలిపారు. మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని కొనియాడారు. ప్రతిభను కనబర్చిన విద్యార్థులకు ప్రోత్సాహన్ని అందిస్తూ... భవిష్యత్తులో బంగారు బాటలు వేసుకోవడానికి దారి చూపారంటూ కేటీఆర్ ప్రశంసించారు. స్పూర్తిదాయకమైన ఈ కార్యక్రమంపై పలువురు ఉన్నతాధికారులు కలెక్టర్‌ను అభినందించారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.