ETV Bharat / offbeat

ఆరోగ్యాన్నిచ్చే "ఓట్స్ పొంగల్" - చిటికెలో చేసుకోండిలా! - బరువు తగ్గాలనుకునేవారికి బెటర్ ఆప్షన్!

మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్​లోకి అద్దిరిపోయే ఓట్స్ పొంగల్ రెసిపీ - ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం!

Oats Pongal Recipe in Telugu
Oats Pongal (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Oats Pongal Recipe in Telugu : నేటి రోజుల్లో ఎక్కువ మంది ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్​లో ఓట్స్​ని భాగం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది పాలలో వేసుకొని తినడం, లేదంటే ఉప్మా, ఇడ్లీ, దోశ వంటి ప్రిపేర్ చేసుకుంటుంటారు. అయితే, ఎప్పుడూ ఒకేరకంగా తింటే బోరింగ్​గా అనిపిస్తుంది.

కాబట్టి, ఓసారి ఓట్స్​తో ఈ స్పెషల్ రెసిపీని ట్రై చేయండి. అదే.. "ఓట్స్ పొంగల్". సూపర్ టేస్టీగా ఉండే దీన్ని నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. పైగా ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే, ఈ పొంగల్ వెంటనే గట్టిపడకుండా గంటల తరబడి మృదువుగా ఉంటుంది! ఇంతకీ, హెల్దీ రెసిపీ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • పెసర పప్పు - ముప్పావు కప్పు
  • పసుపు - కొద్దిగా
  • ఓట్స్ - ఒకటిన్నర కప్పు
  • పాలు - ముప్పావు కప్పు
  • మిరియాలు - 1 టీస్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా

తాలింపు కోసం :

  • నెయ్యి - పావు కప్పు
  • జీడిపప్పు పలుకులు - గుప్పెడు
  • జీలకర్ర - అర టేబుల్​స్పూన్
  • సన్నని అల్లం తరుగు - 1 టేబుల్​స్పూన్
  • పచ్చిమిర్చి - 2
  • ఇంగువ - పావుటీస్పూన్
  • కరివేపాకు - 2 రెమ్మలు

తయారీ విధానం :

  • ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్​లోకి తీసుకోవాలి. ఆపై అందులో కొద్దిగా పసుపు, తగినన్ని వాటర్ పోసుకొని మూతపెట్టి 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
  • పప్పు ఉడికేలోపు స్టౌపై పాన్ పెట్టుకొని రిఫైన్డ్ ఓట్స్ వేసుకొని లో ఫ్లేమ్ మీద కాసేపు వేయించుకోవాలి. అంటే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది.
  • ఆవిధంగా ఓట్స్​ని వేయించుకున్నాక.. అందులో 3 కప్పుల వేడి వాటర్​తో పాటు పాలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత మిశ్రమం దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్​ మీద ఉడికించుకోవాలి. ఓట్స్ ఉడికేలోపు మిరియాలను కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇక ఇప్పుడు ఓట్స్ మంచిగా ఉడికి మిశ్రమం కాస్త చిక్కగా మారాక.. కుక్కర్​లో ఉడికించుకున్న పెసరపప్పును ప్రెజర్ తొలగించుకొని అందులో వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత ఉప్పు, కచ్చాపచ్చాగా దంచుకున్న మిరియాల పొడి కూడా వేసుకొని కలిపి 4 నుంచి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. పెసరపప్పు, ఓట్స్ బాగా ఉడికి మిశ్రమం దగ్గరపడ్డాక పాన్​ని దింపి పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై చిన్న కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగి వేడయ్యాక ముందుగా జీడిపప్పు వేసుకొని కాస్త పొంగనివ్వాలి. ఆపై జీలకర్ర వేసుకొని చిట్లనివ్వాలి.
  • ఆ తర్వాత సన్నని అల్లం తరుగు, పచ్చిమిర్చి చీలికలు వేసుకొని లో ఫ్లేమ్ మీద జీడిపప్పు రంగు మారేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి.
  • ఆవిధంగా వేయించుకున్నాక.. ఇంగువ వేసుకోవాలి. అది కాస్త వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని అది చిటచిటమని చిట్లడం ఆగేంత వరకు తాలింపుని వేయించుకొని దింపుకోవాలి.
  • అనంతరం చక్కగా వేయించుకున్న ఈ తాలింపుని మీరు ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న పెసరప్పు, ఓట్స్ మిశ్రమంలో వేసుకొని కలిపి సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "ఓట్స్ పొంగల్" రెడీ!

ఇవీ చదవండి :

హెల్దీ బ్రేక్​ఫాస్ట్​ "మినప ఆవిరి కుడుములు"- బొంబాయి చట్నీ కాంబినేషన్​తో సూపర్​ టేస్ట్​!

బ్రేక్​ఫాస్ట్​లోకి అద్దిరిపోయే రెసిపీ - తమిళనాడు స్పెషల్ "గుంట పొంగనాలు" - నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.