Neeraj Chopra Coach : ఒలింపిక్ పతక విజేత, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తన కోచ్ క్లాస్ బార్టోనీజ్‌కు ఎమోషనల్ సెండాఫ్ ఇచ్చాడు. 5ఏళ్లుగా తనకు కోచ్‌గా ఉంటున్న 75 ఏళ్ల బార్టోనీజ్ కుటుంబ కారణాలతో కోచింగ్ కెరీర్‌కు ముగింపు పలికాడు. ఈ క్రమంలో నీరజ్ భావోద్వేగానికి గురయ్యాడు. తన కోచ్‌తో ఓ స్పెషల్ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
'ఎక్కడ ప్రారంభించాలో తెలియకుండానే ఇది రాస్తున్నాను. నాకు మీరు గురువు కన్నా ఎక్కువ. ఓ ఆటగాడిగా, వ్యక్తిగా ఎదగడానికి మీరు నాకు ఎంతో నేర్పించారు. ప్రతీ పోటీలో నేను ఫిజికల్‌గా, మెంటల్‌గా ఉండడం కోసం మీరు ఎంతో కష్టపడ్డారు. నాలో కాన్ఫిడెంట్ నింపారు. గాయం కారణంగా నేను ఇబ్బందిపడ్డ రోజుల్లో నాకు అండగానూ నిలిచారు. కెరీర్ ఎత్తుపల్లాలో నాకు తోడుగా ఉన్నారు. స్టాండ్స్‌లో మీరు చాలా సైలెంట్ ఉంటారు. కానీ, జావెలిన్ విసురుతున్నప్పుడు మీరు చెప్పిన మాటలు నా చెవుల్లో మార్మోగుతూ ఉంటాయి. మీ ప్రాంక్‌లు, మీ నవ్వులు లేకపోవడం ఇకపై నాకు అదొక లోటు. నా జర్నీలో భాగమైనందుకు థాంక్స్. మీ జర్నీలో నన్ను భాగం కానిచ్చినందుకు కృతజ్ఞతలు' అని నీరజ్ ఎక్స్‌లో పేర్కొన్నాడు.
I write this without knowing where to begin.
— Neeraj Chopra (@Neeraj_chopra1) November 6, 2024
Coach, you are more than just a mentor to me. Everything you taught has helped me grow both as an athlete and person. You have gone out of your way to make sure I was mentally and physically prepared for every competition. You stood… pic.twitter.com/kJxaPqmHmm
కాగా, జర్మనీకి చెందిన 75ఏళ్ల బార్టోనిట్జ్ గత ఐదేళ్లుగా నీరజ్‌కు శిక్షణ ఇస్తున్నారు. తొలుత బయోమెకానిక్స్ నిపుణుడుగా వచ్చిన బార్టోనిట్జ్, ఆ తర్వాత కోచ్‌గా నియామకమయ్యాడు. బార్టోనిట్జ్ ఆధ్వర్యంలో నీరజ్ చోప్రా తన కెరీర్లో ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్ (2020) లో స్వర్ణం, పారిస్ ఒలింపిక్స్ (2024) లో రజతాన్ని సాధించాడు.
అలాగే ప్రపంచ, డైమండ్ లీగ్ ఛాంపియన్‌గా నిలిచాడు. ఆసియా క్రీడల్లోనూ నీరజ్ గోల్డ్ దక్కించుకున్నాడు. బార్టోనిట్జ్ కోచింగ్‌లో నీరజ్ చోప్రా అద్భుతంగా రాణించాడు. అయితే వయసు రీత్యా, ఇకపై తన ఫ్యామిలీకి సమయం కేటాయించడానికి బార్టోనిట్జ్ ఈ భాగస్వామ్యానికి గత నెల గుడ్‌బై చెప్పాడు.
నీరజ్ చోప్రా కోచ్ షాకింగ్ డెసిషన్ - కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టనున్నాడా? - Neeraj Chopra Coach