రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యూనివర్శిటీల్లో ఉపకులపతులను, ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం డిమాండు చేశారు. సీఎం కేసీఆర్‌కు ప్రైవేటు విశ్వవిద్యాలయాలపై ప్రేమ పెరిగిందని వరంగల్‌లో ఆరోపించారు.
నిరహార దీక్ష..
యూనివర్శిటీల పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ హైదరబాదులో జనవరి 3, 4న నిరాహార దీక్ష చేపట్టనున్నామని తెలిపారు. హన్మకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్రం వచ్చాక విశ్వవిద్యాలయంలో విద్య అందరికీ అందుబాటులో ఉంటుందనుకున్నా. కానీ, వీసీలను నియమించక యూనివర్శిటీలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. పేద విద్యార్థులకు చదువును దూరం చేసేందుకే ప్రైవేటు విద్యాసంస్థలను సీఎం ప్రోత్సహిస్తున్నారు.
-ప్రొఫెసర్ కోదండరాం, తెజస అధ్యక్షుడు
ఇదీ చూడండి: విదేశీ డిగ్రీలను అనుమతించాలని హైకోర్టులో పిల్