ETV Bharat / state

గోదారి పారె.. సిరులు పండె - kharif season Yields increased in bhupalpalli

ఎస్సారెస్పీ కాలువ పారింది.. చెరువులు నిండాయి.. పొలాలు సస్యశ్యామలమయ్యాయి.. అన్నదాతల ఆశలు నెరవేరాయి.. సిరులు పండాయి.. ధాన్యపు రాశులు ఇళ్లకు చేరాయి.. ఇంతలోనే కరోనా మహమ్మారి కలవరపెట్టింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్లను ప్రారంభించింది.. ముమ్మరంగా సేకరిస్తోంది.

kharif  crop Yields increased in bhupalpalli
గోదారి పారె.. సిరులు పండె
author img

By

Published : May 11, 2020, 7:56 AM IST

యాసంగి వరి దిగుబడులు పెరిగాయి. ప్రతి గింజనూ కొంటామని అధికారులు చెబుతున్నారు. ఆరు జిల్లాల్లో కలిపి ఈసారి 9.89 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. సుమారు 9.32 లక్షల మెట్రిక్‌ టన్నుల వడ్లు కొనాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. అందుకనుగుణంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా పీఏసీఎస్‌, ఐకేపీ, డీసీఎంస్‌, జీసీసీ, తదితర సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించింది. ప్రస్తుతం ఆయా కేంద్రాల్లో ధాన్యం రాశులు కనిపిస్తున్నాయి. జోరుగా కొనుగోళ్లు జరుగుతున్నాయి.

పెరిగిన కొనుగోలు కేంద్రాలు:

కరోనా నేపథ్యంలో ఎక్కడి ధాన్యాన్ని అక్కడే అమ్ముకునేలా చర్యలు తీసుకున్నారు. వానాకాలంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 603 కేంద్రాలుండగా, ఈసారి 901 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతులకు కూడా దూరాభారం తగ్గింది. ఆయా గ్రామాల్లోనే విక్రయించుకునే అవకాశం లభించింది. దీంతో కొనుగోళ్లు పెరిగాయి.

ఆయా కేంద్రాల వద్ద భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. చేతులు శుభ్రం చేసుకోవడానికి సబ్బునీళ్లు అందుబాటులో ఉంచుతున్నారు. అయితే అక్కడక్కడ లేవని రైతులు ఆరోపిస్తున్నారు. రద్దీ ఉండకుండా రైతులకు టోకెన్లు అందజేస్తున్నారు. వఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3.05 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు. ఈ నెలాఖరుకల్లా 10 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా కొనుగోళ్లు చేసే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గత వానాకాలంలో 7.87 మెట్రిక్‌ టన్నులు కొన్నారు.

అందుబాటులో కంట్రోల్‌ రూంలు:

కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు సంబంధిత వివరాలను ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేయడంలో జాప్యం చేస్తున్నారు. మిల్లులకు తీసుకెళ్లి వచ్చిన తర్వాతే నమోదు చేస్తున్నారు. ఫలితంగా డబ్బులు ఖాతాల్లో జమ కావడంలో ఆలస్యమవుతోంది. అదేవిధంగా తాలు పేరుతో కోతలు విధిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

లారీల కొరత, మిల్లర్ల వద్ద దిగుమతి కావడం లేదంటూ కాంటా వేసిన బస్తాలను కూడా సకాలంలో తరలించడం లేదని వాపోతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి ఆయా జిల్లా కేంద్రాల్లో ప్రత్యేకంగా కంట్రోల్‌ రూములను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలకు ఫోన్‌ చేసి సమస్య చెబితే.. పరిశీలించి పరిష్కరించడానికి అధికారులు కృషి చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.