ఓరుగల్లు వేయిస్తంభాల ఆలయం కార్తిక శోభను సంతరించుకుంది. కార్తిక సోమవారం కావడం వల్ల తెల్లవారుజామునే భక్తులు ఆలయానికి చేరుకున్నారు. కార్తిక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.
మహిళలు వెలిగించిన దీపాల వెలుగుల్లో ఆలయం ముందున్న నందీశ్వరుడు తేజోమయంగా కనువిందు చేశాడు. రుద్రేశ్వరుణికి ఆలయ అర్చకులు అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామునే పోటెత్తిన భక్తులతో వేయి స్తంభాల కోవెల కిటకిటలాడింది.
- ఇదీ చదవండి : నాల్గో రోజు వైభవంగా తుంగభద్ర పుష్కరాలు