వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియంలో కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ లబ్ధిదారులకు అందజేశారు. కాజీపేట, హన్మకొండ మండలాలకు చెందిన 193 మందికి రూ. కోటి 77 లక్షల చెక్కులను పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో రెండు మండలాలకు చెందిన ఎమ్మార్వోలు, కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులతో పాటు అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. తెరాస ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే కేసీఆర్ను రెండో సారి సీఎంగా చేశాయని వినయ్ భాస్కర్ అన్నారు.
ఇదీ చదవండిః వర్షపు నీటితో నిండిపోయిన ఖైరతాబాద్ రైల్వే స్టేషన్