శనివారం నుంచి పీజీ మెడికల్ డిగ్రీ, డిప్లొమా పరీక్షలు ప్రారంభం కానున్నట్లు కాళోజీ వర్సిటీ వెల్లడించింది. ఈ నెల 20, 22, 24 తేదీల్లో పీజీ డిప్లొమా పరీక్షలు జరగనుండగా... జూన్ 20, 22, 24, 26 తేదీల్లో పీజీ డిగ్రీ పరీక్షలు జరగనున్నట్లు తెలిపింది. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు పరీక్ష జరగనుండగా అభ్యర్థులు ఉదయం 8.30 గంటలు లోపు రిపోర్ట్ చేయాలని వివరించింది.
కొవిడ్-19 వ్యాప్తి దృష్ట్యా పరీక్షా కేంద్రాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోనున్నట్లు తెలిపింది. పరీక్షా కేంద్రాల్లోని ఒక్కో తరగతిలో 25 నుంచి 30 మందికి మాత్రమే సీటింగ్ ఏర్పాట్లు చేసినట్లు కాళోజీ వర్సిటీ అధికారులు వెల్లడించారు.