ETV Bharat / state

రామా చంద్రమౌళికి కాళోజీ నారాయణరావు పురస్కారం - rama chandramouli wins kaloji narayanrao award

రాష్ట్ర ప్రభుత్వం కాళోజీ నారాయణరావు పురస్కారానికి వరంగల్​ జిల్లాకు చెందిన కవి, కథా రచయిత రామా చంద్రమౌళిని ఎంపిక చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్​ అవార్డు గ్రహీతకు ఆమోద ముద్ర తెలుపగా.. ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్ చంద్రమౌళిని అభినందించారు.

rama chandramouli wins kaloji narayanrao award
కాళోజీ నారాయణరావు పురస్కారానికి రామా చంద్రమౌళి ఎంపిక
author img

By

Published : Sep 8, 2020, 6:31 PM IST

కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం వరంగల్​ జిల్లాకు చెందిన కవి, కథారచయిత రమా చంద్రమౌళిని నారాయణరావు పురస్కారానికి ఎంపిక చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆమెద ముద్ర వేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. సీఎం కేసీఆర్​ ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం ప్రభుత్వ ప్రజాకవి నారాయణరావు పేరుతో ప్రతిష్ఠాత్మకంగా అవార్డులు అందజేస్తూ కవులను, కథా రచయితలను, మేధావులను, సాహితీవేత్తలను గౌరవిస్తోంది.

ఈ అవార్డుకు ఎంపికైనా రామా చంద్రమౌళి.. వరంగల్ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్​గా పనిచేసి రిటైరయ్యారు. కవిగా, కథా రచయితగా, నవలాకారుడిగా ప్రసిద్ధికెక్కారు. చంద్రమౌళి కవితా సంకలనాలలో 'దీపశిఖ', 'స్మృతిధార', 'అంతర్దహనం', 'అంతర', 'అసంపూర్ణ' వంటి ప్రముఖ రచనలు. కాళోజీ నారాయణరావు అవార్డుకు ఎంపికైన రామా చంద్రమౌళికి రాష్ట్ర ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్ అభినందించారు.

ఇదీ చూడండి: పీవీకి భారతరత్న తీర్మానం సమయంలో సభలో స్వల్ప సంవాదం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.