ETV Bharat / state

వైద్య, డెంటల్​లో సీట్ల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల - కాళోజీ వర్సిటీలో వైద్య, డెంటల్​లో సీట్ల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల

పీజీ మెడికల్, డెంటల్ కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశాల భర్తీకి దరఖాస్తులను ఈ నెల 25లోపు ఆన్​లైన్​లో పంపించాలంటూ కాళోజీ విశ్వవిద్యాలయం అధికారులు నోటిఫికేషన్​ విడుదల చేశారు.

Kaloji_Health_University_Notification
వైద్య, డెంటల్​లో సీట్ల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల
author img

By

Published : Apr 17, 2020, 8:52 PM IST

పీజీ మెడికల్, డెంటల్ కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశాల భర్తీకి కాళోజీ నారాయణరావు విశ్వవిద్యాలయం అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. నీట్‌ పరీక్షలో అర్హులైన అభ్యర్థులు ఈ నెల 18 నుంచి ఆన్‌లైన్‌లో ఈ నెల 25 లోపు దరఖాస్తులను పంపించాలని వర్సిటీ అధికారులు తెలిపారు.

గతంలో ధ్రువపత్రాల పరిశీలనకు అభ్యర్థులు రావాల్సి ఉండేదని.. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ ఏడాది రిజిస్ట్రేషన్​ సమయంలోనే సంబంధించిన సర్టిఫికేట్లను వెబ్​సైట్​లో అప్​లోడ్​ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. దరఖాస్తులు, ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది మెరిట్​ జాబితా విడుదల చేస్తారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు కాళోజీ విశ్వవిద్యాలయం వెబ్​సైట్ www.knruhs.telangana.gov.in లో చూడవచ్చని తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.